Tollywood: గొడవైతే విడిపోతాం.. నటిస్తూ బతకడం నాకు, తారక్​ కు చేతకాదు: చరణ్​

సినిమా వల్ల తాము స్నేహితులం కాలేదని, ముందు నుంచే తాము స్నేహితులమని చరణ్ చెప్పారు. తమ విషయంలో పుకార్లు, విభేదాలొచ్చినా.. తమ అనుబంధం ఎంత గట్టిగా ఉండేదో మాత్రమే చూసుకునేవాళ్లమని చరణ్ చెప్పారు. భవిష్యత్ లో గొడవలొస్తే తప్పకుండా విడిపోయి విడివిడిగానే ఉంటామన్నారు. ఎదుటి వాళ్ల కోసం నటిస్తూ స్నేహితులుగా ఉండడం తమ ఇద్దరికీ నచ్చదన్నారు. తమ ఇళ్లు పక్కపక్కనే అని, తరచూ కలుస్తూనే ఉంటామని తారక్ చెప్పారు.

చాలా రోజుల తర్వాత హీరోయిన్ తో నటిస్తుండడంతో తారక్ కంగారుపడిపోయాడని చరణ్ అన్నారు. తానేమో అల్లూరి సీతారామరాజు పాత్రలో లీనమైపోయానని, సరదాగా మాట్లాడలేకపోయానని చెప్పారు. అలియా మంచి నటి అని, ఆమె స్థాయికి తగ్గట్టు నటించాలని అనుకున్నానని తెలిపారు. తాను కూడా ఎంతో ఇబ్బంది పడ్డానని, ఆమె నటనకు తాను సెట్ అవగలనా? అంటూ కంగారు పడ్డానని అన్నారు. దానికి అలియా స్పందిస్తూ వారికి బిర్యానీ ఇప్పించడం వల్లే తనను పొగుడుతూ మాట్లాడుతున్నారంటూ జోక్ చేశారు. 
Tollywood
Ramcharan
Junior NTR
RRR
Rajamouli
Alia Bhatt

More Telugu News