ఒమిక్రాన్ ఎఫెక్ట్.. హైద‌రాబాద్‌లో రేప‌టి సండే ఫ‌న్ డే ర‌ద్దు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. హైద‌రాబాద్‌లో రేప‌టి సండే ఫ‌న్ డే ర‌ద్దు

sunday funday event cancelld
  • చార్మినార్‌ వద్ద 'ఏక్‌ శామ్‌ చార్మినార్‌ కే నామ్' కూడా ర‌ద్దు
  • పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్ర‌క‌ట‌న
  • భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ యథావిధిగా నిర్వహించే అవ‌కాశం
హైద‌రాబాద్‌లోని ట్యాంక్ బాండ్ వ‌ద్ద ప్ర‌తి ఆదివారం ఏర్పాటు చేస్తున్న సండే ఫ‌న్ డే కార్య‌క్ర‌మంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ ప‌డింది. ప్ర‌పంచవ్యాప్తంగా ఆందోళ‌న‌క‌రంగా మారిన క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే భార‌త్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. ఆ భ‌యం హైద‌రాబాద్‌ను ప‌ట్టుకుంది. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి చెంద‌కుండా తీసుకుంటోన్న చ‌ర్య‌ల్లో భాగంగా రేపు ట్యాంక్‌బండ్‌పై నిర్వ‌హించాల్సిన సండే ఫ‌న్ డే కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేశారు. అంతేకాదు, ప్ర‌తి ఆదివారం చార్మినార్‌ వద్ద నిర్వహిస్తున్న 'ఏక్‌ శామ్‌ చార్మినార్‌ కే నామ్' కార్య‌క్ర‌మాన్ని కూడా ర‌ద్దు చేశారు.

ఈ మేర‌కు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. పరిస్థితులు బాగుంటే భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న సండే ఫ‌న్ డే కార్యక్రమానికి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఆదివారం నిర్వ‌హించే ఆ కార్య‌క్ర‌మం కోసం ట్యాంక్ బండ్ వ‌ద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు.
sunday funday
Hyderabad

More Telugu News