తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసుల నమోదు!

  • కరోనా నుంచి కోలుకున్న 184 మంది
  • రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,887
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో ఒకరు మృతి చెందగా... 184 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.83 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,887 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 312 మంది వచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,77,747కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,69,857కి చేరుకుంది.

Telangana
Corona Virus
Updates

More Telugu News