‘పెద్దమ్మా.. మీకు కొత్త ఫోన్‌ ఇప్పించే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చి మాట నిల‌బెట్టుకున్న సీఎం జ‌గ‌న్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘పెద్దమ్మా.. మీకు కొత్త ఫోన్‌ ఇప్పించే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చి మాట నిల‌బెట్టుకున్న సీఎం జ‌గ‌న్

jagan gives cellphone to woman
  • ఇటీవ‌ల చిత్తూరు జిల్లాలో జగన్‌తో సెల్ఫీ
  • ఆ క్రమంలో ఫోన్‌ పోగొట్టుకున్న ఓ మహిళ
  • ఈ చిన్న విష‌యాన్నీ మ‌ర్చిపోని జ‌గ‌న్
  • గుర్తుపెట్టుకొని  సెల్‌ఫోన్‌ పంపిస్తారనుకోలేదంటూ మ‌హిళ‌ హ‌ర్షం
ఇటీవ‌ల చిత్తూరు జిల్లాలో జగన్‌తో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఫోన్‌ పోగొట్టుకున్న ఓ మహిళ తాజాగా ఓ కొత్త సెల్‌ఫోన్‌ అందుకుని హ‌ర్షం వ్య‌క్తం చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే  వరద బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 3న చిత్తూరు జిల్లా తిరుపతిలోని సరస్వతి నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు జగన్‌తో సెల్ఫీ దిగేందుకు ముందుకు దూసుకువచ్చారు.

ఆ స‌మ‌యంలో  విజయ అనే మ‌హిళ‌ సెల్‌ఫోన్‌ జారి కాలువలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన జగన్‌ ‘పెద్దమ్మా, మీకు కొత్త ఫోన్‌ ఇప్పించే బాధ్యత నాది. బాధపడవద్దు’ అని హామీ ఇచ్చారు. ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను కూడా విజ‌య మ‌ర్చిపోయింది. అయితే, సీఎం ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరీష కొత్త సెల్‌ఫోన్‌ను డాక్టర్‌ రవికాంత్‌ ద్వారా విజ‌య‌కు అందజేశారు.

దీంతో విజ‌య స్పందిస్తూ... త‌న‌ను ఓదార్చడానికి జగన్ బాబు అలా చెప్పారనుకున్నాన‌ని వ్యాఖ్యానించింది. నిజంగానే ఈ విష‌యాన్ని గుర్తుపెట్టుకొని  సెల్‌ఫోన్‌ పంపిస్తారనుకోలేదని హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఆ మ‌హిళకు జ‌గ‌న్ సెల్‌ఫోన్ కొనిచ్చిన ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.
Jagan
YSRCP
Viral Pics

More Telugu News