ఆఫ్రికా దేశం బురిండి జైలులో అగ్నిప్రమాదం.. 38 మంది ఖైదీల సజీవ దహనం
- బురుండి రాజధాని గిటాగా జైలులో ప్రమాదం
- ఒక్కసారిగా చుట్టుముట్టిన మంటలు
- తప్పించుకునే మార్గం లేక ఆహుతి
- 400 మంది ఉండాల్సిన చోట 1500 మంది ఖైదీలు
మరో 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిజానికి ప్రమాదం సంభవించిన ఈ జైలులో ఖైదీల సామర్థ్యం 400 కాగా, 1500 మందికిపైగా ఖైదీలను కుక్కేశారు. ఫలితంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.