'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ వాయిదా!
- కీర్తి సురేశ్ నాయికగా 'గుడ్ లక్ సఖి'
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
- ఈ నెల 31వ తేదీన విడుదల
గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. అందుకు తగిన విధంగా డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.
కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా తాజాగా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
.