కొత్త రోడ్డుకు కొబ్బరికాయ కొడితే.. ఏం పగిలిందో తెలుసా?
- ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూరులో కొత్త రోడ్డును ప్రారంభించిన మహిళా ఎమ్మెల్యే
- కొబ్బరికాయ కొడితే కంకర బయటకు వచ్చిన వైనం
- అధికారులపై కన్నెర్ర చేసిన ఎమ్మెల్యే
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూరులో జరిగింది. 7 కిలోమీటర్ల ఈ రోడ్డును కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. కొబ్బరికాయ కొట్టగానే రాళ్లు బయటకు రావడంతో ఎమ్మెల్యే భర్త పార తీసుకొచ్చి చదును చేశారు. దీనిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాట్లాడుతూ రోడ్డు శాంపిల్ ను పరీక్షల కోసం పంపించామని తెలిపారు. మరోవైపు జనాలు కూడా రోడ్డు నాణ్యతపై మండిపడుతున్నారు.