ఏపీలో మరో 138 మందికి కరోనా పాజిటివ్
- ఏపీలో బాగా తగ్గిన కొత్త కేసులు
- గత 24 గంటల్లో 31,065 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 25 కేసులు
- కృష్ణా జిల్లాలో ఒకరి మృతి
- ఇంకా 2,157 మందికి చికిత్స
అదే సమయంలో 118 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,390 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,56,788 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,157 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,445కి పెరిగింది.