కరోనా నుంచి కోలుకున్న కమలహాసన్.. అయినా మరో రెండ్రోజులు ఆసుపత్రిలోనే!
- గత నెల 22న ఆసుపత్రిలో చేరిన కమల్
- 3వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కమల్
- ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన వైనం
ఈ నెల 3వ తేదీన ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 4వ తేదీ నుంచి ఆయన యథావిధిగా తన పనులను ప్రారంభించవచ్చని చెప్పారు. ఇటీవలే కమలహాసన్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చారు. చెన్నైకు చేరుకున్న తర్వాత దగ్గు వస్తుండటంతో ఆయన డాక్టర్లను సంప్రదించారు. ఆయనకు నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.