ఈ విధంగా జరిగితే యువతకు ఉద్యోగాలు ఎక్కడ్నించి వస్తాయి?: నారా లోకేశ్
- సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు
- పత్రికా కథనాల ఆధారంగా వ్యాఖ్యలు
- రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన ఏదీ అంటూ ఆగ్రహం
- పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన
చంద్రబాబు హయాంలో వైజాగ్ పెట్టుబడిదారులకు ఎంతో ఆకర్షణీయమైన గమ్యస్థానంలా విలసిల్లిందని, కానీ జగన్ వచ్చి ఒప్పందాలను రద్దు చేయడంతో 10 వేల ఉద్యోగాలు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. "లులూ గ్రూప్ కానివ్వండి, సింగపూర్ పరిశ్రమల కన్సార్టియం కానివ్వండి, టాటా రెన్యూవబుల్ పవర్, ఆసియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమలు కానివ్వండి ... జగన్ అతడి ముఠా కారణంగా ఏపీకి దూరమయ్యాయి. ఇక్కడి ప్రజలకు ఉపాధి దూరమైంది. ఏపీ ఇంత దుస్థితిలో చిక్కుకోవడానికి జగనే కారణం" అని విమర్శించారు.