తిరుమల భక్తులకు శుభవార్త.. రేపు సర్వదర్శనం టోకెన్ల విడుదల
- రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల
- తిరుమలలో వసతి టికెట్లు ఆదివారం జారీ
- టోకెన్లు క్షణాల్లోనే అయిపోతుండడంపై సామాన్య భక్తులకు అందని వైనం
సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్‌లైన్ చేసి ప్రతి నెల నిర్దేశిత కోటా టోకెన్లను విడుదల చేస్తోంది. అయితే, సర్వదర్శనాన్ని కూడా ఆన్‌లైన్ చేయడంపై భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న టోకెన్లు క్షణాల్లో అయిపోవడంతో సామాన్య భక్తులకు టోకెన్లు అందకుండా పోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.