‘వ్యవస్థీకృత గందరగోళం’.. కివీస్ జట్టులో ముంబై స్పిన్సర్.. అందరి కళ్లూ అతడి పైనే!
- 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి న్యూజిలాండ్‌కు వలస
- ముంబైలో జన్మించిన అజాజ్ పటేల్
- ఇండియాలో ఇండియాను ఎదుర్కోవడం అంతా ఆషామాషీ ఏమీ కాదన్న పటేల్
- వర్ణించలేని ప్రదేశాలలో భారతదేశం ఒకటి
బ్లాక్ కేప్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మాట్లాడుతూ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ‘‘భారతదేశమంటే భారతదేశమే. వర్ణించలేని ప్రదేశాలలో ఇదొకటి. దానిని మీరు అనుభవించాల్సి ఉంటుంది. ఒకానొక సమయంలో దీనిని నేను ‘వ్యవస్థీకృత గందరగోళం’గా భావిస్తాను. ఇది నిజంగా ఎంతో ప్రత్యేకమైనది’’ అని పటేల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
టీనేజ్‌లో స్పిన్నర్‌గా రాణించిన పటేల్ ప్రస్తుతం లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా సత్తా చాటుతున్నాడు. ఓ స్పిన్నర్‌గా ఇండియాను సొంతగడ్డపై ఎదుర్కోవడం అంత ఆషామాషీ ఏమీ కాదన్న పటేల్.. భారత్‌ను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పాడు. టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నాడు.
న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో అజింక్య రహానే తొలి టెస్టుకు సారథ్యం వహిస్తాడు. రెండో టెస్టుకు మాత్రం కోహ్లీ సారథ్యంలోనే జరగనుంది.