ఏపీ సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖాస్త్రం
- సర్పంచ్ ల అధికారాలు, నిధులపై లేఖ
- పంచాయతీ అభివృద్ధి ఎలా సాధ్యమన్న రామకృష్ణ
- ఇదేనా అధికార వికేంద్రీకరణ అంటూ విమర్శలు
- సర్పంచ్ లు ఆందోళనకు సిద్ధమవుతున్నారని వెల్లడి
సర్పంచ్ లకు అధికారాలు లేకుండా చేయడమే అధికార వికేంద్రీకరణా? అని నిలదీశారు. ప్రభుత్వం తీసుకున్న పంచాయతీల నిధులు రూ.3,450 కోట్లు తిరిగివ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్రంలోని సర్పంచ్ లు నిరసనలకు దిగే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.