Mallu Bhatti Vikramarka: కేంద్రంపై కేసీఆర్ యుద్ధానికి వెళ్లినందుకు సంతోషం: భట్టి

Bhatti Vikramarka comments CM KCR
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాజా పరిణామాలపై స్పందించారు. కేంద్రంపై కేసీఆర్ యుద్ధానికి వెళ్లినందుకు సంతోషం అని వ్యాఖ్యానించారు. కేంద్రంపై పోరులో గతంలో యూటర్న్ తీసుకున్న కేసీఆర్ మరోసారి అలా చేయరాదని అన్నారు. నాడు రైతుల చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి, ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు హస్తినపై యుద్ధమే అంటున్నారని, అమిత్ షాను కలుస్తానని అంటున్నారని వివరించారు. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరని, ఢిల్లీలో కేసీఆర్ యుద్ధం తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Go Back to Shorts
Mallu Bhatti Vikramarka
CM KCR
Center
Telangana

More Telugu News