శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు.. ప్రవేశపెట్టిన బుగ్గన

Three capital revoke bill in AP Council
  • మూడు రాజధానుల చట్టాన్ని నిన్న ఉపసంహరించుకున్న ప్రభుత్వం
  • పాలనా వికేంద్రీకరణ అవసరమన్న బుగ్గన
  • లేకుంటే వేర్పాటువాద ముప్పు తప్పదన్న మంత్రి
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు నిన్న ప్రకటించిన ఏపీ ప్రభుత్వం నేడు ఇందుకు సంబంధించిన బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కొద్దిసేపటి క్రితం మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వికేంద్రీకరణ అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పుడు కనుక ఈ నిర్ణయం తీసుకోకుంటే ఎప్పటికైనా వేర్పాటువాద ముప్పు తప్పదని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Three Capitals Bill
Buggana Rajendranath

More Telugu News