మెగా డాటర్ మూవీలో 'ఉప్పెన' బ్యూటీ?

Krithi Shetty in Susmitha movie
  • వరుస సినిమాలతో బిజీగా కృతి
  • వచ్చేనెలలో రిలీజ్ కి 'శ్యామ్ సింగ రాయ్'
  • మిగతా సినిమాలు సెట్స్ పైన
  • సుస్మిత కథకి గ్రీన్ సిగ్నల్
'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను వరకూ సినిమాలు ఉన్నాయి. ఇక చర్చల దశలో చాలానే ప్రాజెక్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాని సరసన ఆమె చేసిన 'శ్యామ్ సింగ రాయ్' వచ్చేనెలలో విడుదల కానుంది.

ఇక రామ్ .. నితిన్ .. చైతూ .. సుధీర్ బాబులతో ఆమె చేస్తున్న సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో కూడా ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండటం విశేషం. ఇక ఆ తరువాత సినిమా నాయిక ప్రధానమైనది కావొచ్చని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు .. మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత.

సుస్మిత ఆల్రెడీ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఇకపై ఆ బ్యానర్ పై సినిమాలను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో సన్నాహాలు మొదలుపెట్టింది. నాయిక ప్రధానమైన ఒక కథను ఎంపిక చేసుకున్న ఆమె, ప్రధాన పాత్ర కోసం కృతి శెట్టిని అనుకుందట. కృతి శెట్టి కథ వినడం .. ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. జీ స్టూడియోస్ తో కలిసి సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తుందట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
Krithi Shetty
Susmitha
Upcoming Movie
Tollywood

More Telugu News