ఏపీలో కొత్తగా 174 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 24,659 కరోనా పరీక్షలు
- కృష్ణా జిల్లాలో 32 మందికి పాజిటివ్
- ఇంకా 2,265 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,244 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,54,553 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,265 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,426గా ఉంది.