ఏపీలో కొత్తగా 164 మందికి కరోనా
- గత 24 గంటల్లో 25,197 కరోనా పరీక్షలు
- కృష్ణా జిల్లాలో 32 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 2,392 మందికి చికిత్స
అదే సమయంలో 196 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,070 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,54,252 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,392 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,426కి పెరిగింది.