తెలంగాణలో మరో 137 మందికి కరోనా నిర్ధారణ
- గత 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 48 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,657 మందికి చికిత్స
అదే సమయంలో 173 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,74,318 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,682 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,657 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,979కి పెరిగింది.
