ఏపీలో కొత్తగా 168 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 31,040 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 35 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 2,425 మందికి చికిత్స
అదే సమయంలో 301 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,906 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,54,056 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,425 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,425కి పెరిగింది.