Venkatesh: అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25 నుంచి 'దృశ్యం 2'

Drushyam 2 will be released in OTT
షార్ట్స్‌లో చూడండి
వెంకటేశ్ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'దృశ్యం' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా చదువుకోని ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక హత్యానేరం నుంచి తన భార్య బిడ్డలను ఎలా కాపాడుకున్నాడు? అనేదే కథ. ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ కావడంతో భారీ వసూళ్లను రాబట్టింది.

ఇప్పుడు అదే నటీనటులతో 'దృశ్యం 2' సినిమాను రూపొందించారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు.
 
ఈ  కార్యక్రమంలో వెంకటేశ్ .. మీనా .. నరేశ్ .. సంపత్ రాజు .. శ్రీప్రియలతో పాటు, దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు.'దృశ్యం' సినిమాకి మించి ఈ సినిమా ఆసక్తిని పెంచుతుందనీ, తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Venkatesh
Meena
Naresh
Nadiya
Drushyam 2 Movie

More Telugu News