Roja: చంద్రబాబు, నారా లోకేశ్ పై రోజా తీవ్ర విమర్శలు

Nara Lokesh comments are ridiculous says Roja
  • ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే విధంగా లోకేశ్ వ్యాఖ్యలు ఉన్నాయన్న రోజా
  • కుప్పంలో కూడా బాబును రాజకీయ సమాధి చేసేలా ఉన్నాయని వ్యాఖ్య
  • కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారు
చంద్రబాబు, నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. లోకేశ్ కామెంట్స్ చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే విధంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తుంగలో తొక్కారని, మున్సిపల్ ఎన్నికల్లో మురుగు కాల్వలో ముంచి తీశారని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తరిమి కొట్టారని అన్నారు. అయినా వారికి బుద్ధి రాలేదని చెప్పారు.

కుప్పంలో లోకేశ్ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని... కుప్పంలో కూడా చంద్రబాబును రాజకీయ సమాధి చేసే విధంగా ఉన్నాయని అన్నారు. కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కూడా లేకపోవడం దారుణమని చెప్పారు. జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు.
Roja
YSRCP
Jagan
Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News