తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. గంట గంటకూ మారుతున్న సమీకరణాలు
- తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ
- మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ కూటమి
- మద్దతుపై వీసీకే పార్టీ సస్పెన్స్.. డిప్యూటీ సీఎం పదవి డిమాండ్
- విజయ్ పార్టీపై టీటీవీ దినకరన్ ఫోర్జరీ ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదు
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నటుడు, రాజకీయ నేత విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరగా వచ్చి ఆగిపోవడంతో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గంట గంటకూ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మిత్రపక్షాల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు, చివరి నిమిషం మలుపులతో తమిళ రాజకీయాలు ఓ పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించాయి.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2) మద్దతుతో విజయ్ కూటమి బలం 116కు చేరింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని ప్రకటించినా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన విజయ్ కేవలం 116 మంది ఎమ్మెల్యేల సంతకాలతోనే మద్దతు లేఖ సమర్పించినట్లు తెలిసింది.
రెండు స్థానాలున్న వీసీకే పార్టీ మద్దతు ఈ దశలో కీలకంగా మారింది. తొలుత విజయ్‌కు మద్దతిచ్చేలా సంకేతాలిచ్చిన ఆ పార్టీ, చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తమ పార్టీ అధినేత తిరుమావళవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వీసీకే డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి టీవీకే అంగీకరించకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. తమ తుది నిర్ణయాన్ని శనివారం ఉదయం ప్రకటిస్తామని వీసీకే ప్రకటించడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.
మరోవైపు, అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్.. విజయ్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మద్దతు లేఖలో చేర్చారని ఆయన ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా, దినకరన్ అనుమతితోనే కామరాజ్ మద్దతు లేఖపై సంతకం చేస్తున్న వీడియోను టీవీకే విడుదల చేయడం వివాదాన్ని మరింత పెంచింది.
ఈ పరిణామాల మధ్య, విజయ్‌ను కాదని, ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని దినకరన్ గవర్నర్‌ను కోరారు. మరోవైపు, విజయ్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు డీఎంకే పార్టీ.. ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చే ప్రతిపాదన చేసిందని, అయితే తాము దాన్ని తిరస్కరించామని సీపీఎం నేత ఎంఏ బేబీ వెల్లడించారు.