తమిళనాడులో రాజకీయ గందరగోళం.. మళ్లీ వైరల్ అవుతున్న ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్!
- ప్రమోద్ మహాజన్ పార్లమెంట్ ప్రసంగం వైరల్
- తమిళనాడులో హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో మళ్లీ తెరపైకి
- అతిపెద్ద పార్టీ ప్రతిపక్షంలో, ఒక్క సభ్యుడి పార్టీ ప్రభుత్వంలో అంటూ చురకలు
- దేవెగౌడ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సందర్భంగా మహాజన్ వ్యాఖ్యలు
సుమారు మూడు దశాబ్దాల క్రితం నాటి ఒక పార్లమెంట్ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ 1997లో లోక్‌సభలో చేసిన చమత్కారభరితమైన, చురకలతో కూడిన ఈ ప్రసంగం.. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టడంతో నెటిజన్లు దాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు. అక్కడ సమీకరణలు రోజురోజుకు మారుతుండటంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్న దానిపై క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. రెండుమూడు స్థానాల్లో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు, ఇటీవలి ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ అధినేత విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించడం లేదు. విజయ్ ఇప్పటికి మూడుసార్లు గవర్నర్‌ను కలిసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వింత రాజకీయ పరిస్థితిపైనే ప్రమోద్ మహాజన్ అప్పట్లో తన ప్రసంగంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మహాజన్ ఏం మాట్లాడారు?
1997 ఏప్రిల్ 11న, అప్పటి ప్రధాని హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వంపై జరిగిన విశ్వాస పరీక్ష చర్చలో మహాజన్ మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వంలోని వైరుధ్యాలను ఆయన ఓ ఉదాహరణతో వివరించారు. "నేను లోక్‌సభలో అతిపెద్ద పార్టీకి చెందిన సభ్యుడిని, కానీ ప్రతిపక్షంలో ఉన్నాను. రెండో అతిపెద్ద పార్టీ (కాంగ్రెస్) ప్రభుత్వంలో లేదు, కానీ బయటి నుంచి మద్దతిస్తోంది. మూడో అతిపెద్ద పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి, కానీ మంత్రివర్గంలో లేదు. ఇక తన పార్టీలో ఏకైక సభ్యుడైన రామాకాంత్ ఖలాప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు" అంటూ మహాజన్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.
బయటి నుంచి ఇచ్చే మద్దతును ఉద్దేశించి "ఒకరు నిచ్చెన పట్టుకుని, మీరు పైకి ఎక్కగానే దాన్ని లాగేయడం లాంటిది ఈ మద్దతు" అని ఆయన సెటైర్ వేశారు. దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి మధ్య బంధాన్ని "హనీమూన్ కూడా మొదలవకముందే విడాకులకు సిద్ధమైన పెళ్లి"గా అభివర్ణించారు.
1996 ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్.. దేవెగౌడ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్నాళ్లకే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో ఆ ప్రభుత్వం కూడా కూలిపోయింది. ప్రస్తుతం 2024 ఎన్నికల తర్వాత దేశంలో మళ్లీ సంకీర్ణ శకం మొదలైన నేపథ్యంలో, మహాజన్ ప్రసంగం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.