తాను రాళ్ల దాడిలోనే గాయపడ్డానని విద్యార్థిని జయలక్ష్మి ఎంతో నిజాయతీగా చెప్పింది: అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప
- ఇటీవల అనంతపురంలో విద్యార్థుల ఆందోళన
- విద్యార్థిని జయలక్ష్మికి గాయాలు
- పోలీసుల లాఠీచార్జినే కారణమని విపక్షాల ఆగ్రహం
- విద్యార్థినిని పరామర్శించిన జిల్లా ఎస్పీ
జయలక్ష్మి నివాసానికి వెళ్లిన ఆయన ఆమెతోనూ, ఆమె కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాళ్ల దాడిలోనే గాయపడ్డానని విద్యార్థిని జయలక్ష్మి నిజాయతీగా చెప్పిందని వెల్లడించారు. సాయిబాబా కాలేజీలో విద్యార్థులపై లాఠీచార్జి జరగలేదని స్పష్టం చేశారు. ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ముసుగులో కొందరు రాళ్ల దాడికి పాల్పడినట్టు భావిస్తున్నట్టు తెలిపారు.