పునీత్ కు ఇష్టమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పుణ్యతిథి నిర్వహించిన కుటుంబ సభ్యులు
- గత నెలలో మరణించిన పునీత్ రాజ్ కుమార్
- ఆచారాలు పాటిస్తున్న కుటుంబ సభ్యులు
- పునీత్ సమాధి వద్ద పుణ్యతిథి నిర్వహణ
- 30 రకాల వంటకాల సమర్పణ
ఈ పుణ్యతిథి కార్యక్రమానికి పునీత్ అర్ధాంగి అశ్విని, కుమార్తెలు వందిత, ధృతి, సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నటుడు శివరాజ్ కుమార్ మరోసారి తమ్ముడి విషాదాంతంతో తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. పునీత్ తనకు బిడ్డలాంటి వాడని, పునీత్ పద్మశ్రీ కాదు అమరశ్రీ అని పేర్కొన్నారు. పునీత్ ఎక్కడికీ వెళ్లలేదని, ప్రతి ఒక్కరి మనసులో సజీవంగా ఉన్నాడని అన్నారు.