Andhra Pradesh: ఏపీలో మరో 320 మందికి కరోనా పాజిటివ్

AP Corona Daily Stats
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 38,768 కరోనా పరీక్షలు నిర్వహించగా, 320 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 67 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 41, పశ్చిమ గోదావరి జిల్లాలో 39, విశాఖ జిల్లాలో 36 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 4 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 425 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,241 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,50,386 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,458 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 14,397కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Cases
Media Report

More Telugu News