విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ఇప్పుడేం చెబుతారు?: చంద్రబాబు
- భగ్గుమంటున్న చమురు ధరలు
- ఇతర రాష్ట్రాల్లో తగ్గించారన్న చంద్రబాబు
- ఏపీలోనూ తగ్గించాలని డిమాండ్
- పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని వెల్లడి
పెట్రో ధరల పెంపును తీవ్రంగా పరిగణించాల్సిందేనని, పెట్రో ధరల పెంపు ప్రభావం అనేక రంగాలపై ఉంటుందని అన్నారు. ధరల పెంపు కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రజలపైనా తీవ్ర భారం పడుతోందని చంద్రబాబు వివరించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని నాడు జగన్ చెప్పారని గుర్తు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.