Somu Veerraju: ఈ అంశాన్ని హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక నిరూపించింది.. ఏపీలోనూ అలా జ‌ర‌గాల‌ని ఆశిద్దాం: సోము వీర్రాజు

somu veerraju slams on ycp
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓట‌ర్ల‌లో చైత‌న్యం వ‌చ్చిందని బీజేపీ నేత‌లు అంటున్నారు. తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌పై బీజేపీ సాధించిన విజ‌యాన్ని ప్ర‌స్తావిస్తూ బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

'హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన శ్రీ ఈటల రాజేంద‌ర్ గారికి శుభాకాంక్షలు. అధికారం అడ్డుపెట్టుకుని సాగించే దాడులు, ప్రలోభాలు, పంపకాలు తరహా దాడులు ప్రజా చైతన్యం ముందు దిగదుడుపేనని హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక నిరూపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కూడా త్వరలో ఇలాంటి చైతన్యాన్ని ఆశిద్దాం' అని సోము వీర్రాజు పేర్కొన్నారు. కాగా, ఏపీలో జ‌రిగిన బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో వైసీపీ చేతిలో బీజేపీ ఓడిపోయిన విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
Somu Veerraju
BJP
YSRCP
Huzurabad

More Telugu News