అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: జేపీ నడ్డాకు చెప్పిన ఈటల
- జేపీ నడ్డా జీ.. ఈ ఎన్నికలో మాపై నమ్మకం ఉంచారు
- మాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు
- ప్రధాని మోదీ, బండి సంజయ్ నేతృత్వంలో పని చేస్తాం
- మీ సూచనలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయన్న ఈటల
'జేపీ నడ్డా జీ.. ఈ ఎన్నికలో మాపై నమ్మకం ఉంచి, మాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు. ప్రధాని మోదీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నిబద్ధతతో పని చేసేందుకు మీ సూచనలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము' అని ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు.