తెలంగాణలో కొత్తగా 167 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 37,941 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,933 మందికి చికిత్స
అదే సమయంలో 207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,790 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,898 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,933 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,959కి పెరిగింది.
