వాహనాలకు ఈ సర్టిఫికెట్ లేకుంటే జైలుకే.. కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ కంపల్సరీ
- తనిఖీల సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ కచ్చితంగా దగ్గరుండాలి
- లేకపోతే ఆరు నెలలు జైలు శిక్ష లేదా 10 వేల జరిమానా
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ టెస్ట్ కచ్చితంగా చేయించాల్సిందేనని హెచ్చరించింది. రోడ్డు మీదకు వచ్చే వాహనాలకు సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికెట్ కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలని తెలిపింది. వాహనాలను తనిఖీ చేసే సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 10 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.