వచ్చే నెల 9న రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ: రేవంత్ రెడ్డి
- రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను నమోదు చేస్తామని సోనియాకు మాట ఇచ్చాం
- పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల జీవిత బీమా
- ఈ నెల 14 నుంచి 21 వరకు జన జాగరణ యాత్ర
పార్టీ కార్యకర్తలకు ఈ నెల 9 నుంచి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని రేవంత్ చెప్పారు. 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జన జాగరణ యాత్ర ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 9న భారీ బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు అనుమతిస్తే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తామని, ఇవ్వకపోతే నగర శివారులో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు.