Chiranjeevi: 'వాల్తేర్ వీర్రాజు'లో చిరూ జోడిగా శ్రుతి హాసన్!

Valther Veerraju movie update
షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టును చిరంజీవి లైన్లో పెట్టేస్తున్నారు. ఆయన తరువాత ప్రాజెక్టుగా 'భోళా శంకర్' సెట్స్ పైకి వెళ్లనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చేనెల రెండవ వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.

ఆ వెంటనే నాలుగైదు రోజుల గ్యాపులో రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను ఎంపిక చేశారు. 'సైరా' తరువాత చిరంజీవితో తమన్నా చేస్తున్న సినిమా ఇది. ఇక ఈ సినిమా తరువాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి 'వాల్తేర్ వీర్రాజు' సినిమాను చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కనుంది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ .. చరణ్ .. బన్నీతో కలిసి నటించిన శ్రుతి హాసన్, ఈ సారి మెగాస్టార్ తోనే చేయనుందన్న మాట. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన నాయికగా 'సలార్' చేస్తోంది. బాలకృష్ణ తరువాత సినిమా హీరోయిన్ గా కూడా ఆమె పేరే వినిపిస్తోంది.
Go Back to Shorts
Chiranjeevi
Bobby
Sruthi Haasan

More Telugu News