గ్లామర్ డోస్ పెంచే ఆలోచనలో మెహ్రీన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్లామర్ డోస్ పెంచే ఆలోచనలో మెహ్రీన్!

Mehreen Movies Update
  • పెళ్లి నిర్ణయంతో అవకాశాలు వదులుకున్న మెహ్రీన్
  • పెళ్లి తప్పిపోవడంతో మళ్లీ కెరియర్ పై దృష్టి
  • చిన్న హీరోతో చేయడానికీ వెనుకాడని మెహ్రీన్
  • వచ్చే నెల 4న 'మంచి రోజులు వచ్చాయి' రిలీజ్
  • సెట్స్ పై ఉన్న 'ఎఫ్ 3' సినిమా
అందం .. అభినయంతో పాటు అదృష్టం ఉన్నప్పుడే కథానాయికలకు కలిసొస్తుంది. మెహ్రీన్ మంచి అందగత్తె .. తొలి సినిమా 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమా హిట్ తో తాను అదృష్టవంతురాలినని కూడా నిరూపించుకుంది. ఆ తరువాత చేసిన 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' సినిమాలు ఆమె కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి. దాంతో ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ లో తన జోరును కొనసాగించడం ఖాయమని అనుకున్నారు.

ఆ తరువాత వరుసగా పరాజయాలు ఎదురైనా,'ఎఫ్ 2' సక్సెస్ ఆమెను కొంతవరకూ ఆదుకుంది. ఇక 'ఎంతమంచి వాడవురా'  ఫరవాలేదనిపించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో, అవకాశాలను పక్కన పెట్టేసింది. దాంతో ఆ అవకాశాలు వేరే వారికి వెళ్లిపోయాయి. తీరా చూస్తే పెళ్లి కూడా కొన్ని కారణాల వలన ఆగిపోయింది.

ఇక ఇప్పుడు మళ్లీ ఆమె కెరియర్ పై దృష్టి పెట్టింది. సాధ్యమైనంత త్వరగా కుదురుకోవాలనే ఉద్దేశంతో, సంతోష్ శోభన్ జోడిగా 'మంచిరోజులు వచ్చాయి' చేసింది. వచ్చేనెల 4 తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్య కాస్త బక్క చిక్కిన మెహ్రీన్ .. ఇక ఒళ్లు చేసి గ్లామర్ డోస్ పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న 'ఎఫ్ 3' సెట్స్ పై ఉంది.
Mehreen
Manchi Rojulu Vachayi Movie
F3 Movie

More Telugu News