బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- వరి వేస్తే ఉరేనన్న సిద్ధిపేట జిల్లా కలెక్టర్
- కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ
- బీజేపీ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు
ఈ పరిస్థితుల నేపథ్యంలో, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా... ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్ ను ముట్టడించేందుకు జిల్లా బీజేపీ సిద్ధమయింది. ఈ క్రమంలో రఘునందన్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న ఆయనను నిర్బంధించారు. మరోవైపు బీజేపీ శ్రేణులెవరూ కూడా కలెక్టరేట్ వద్దకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.