దుబ్బాకలో చెల్లని హరీశ్ రావు వ్యూహాలు హుజూరాబాద్‌లో చెల్లుతాయా?: విజ‌య‌శాంతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబ్బాకలో చెల్లని హరీశ్ రావు వ్యూహాలు హుజూరాబాద్‌లో చెల్లుతాయా?: విజ‌య‌శాంతి

vijay shanti slams harish rao
  • దళితుడిని బూతులు తిట్టి, కొట్టిన దళిత విద్రోహి హరీశ్‌ రావు
  • హుజూరాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు
  • అప్ప‌ట్లో కేటీఆర్‌ని ఓడించాలని హ‌రీశ్ రావు కుట్ర  
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాట‌ల వేడి మ‌రింత పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావుపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మ‌రోసారి మండిప‌డ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆమె ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... దళితుడిని బూతులు తిట్టి, కొట్టిన దళిత విద్రోహి హరీశ్‌ రావు అని విమ‌ర్శించారు.

హుజూరాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని ఆమె అన్నారు. అప్ప‌ట్లో కేటీఆర్‌ని ఓడించాలని హ‌రీశ్ రావు కుట్ర పన్నార‌ని ఆమె ఆరోపించారు. దుబ్బాకలో చెల్లని హరీశ్ రావు వ్యూహాలు ఇప్పుడు హుజూరాబాద్‌లో చెల్లుతాయా? అని ఆమె ప్ర‌శ్నించారు.

Vijayashanti
BJP
TRS

More Telugu News