ప్రభాస్ గారిని ఎప్పటికీ మరిచిపోలేను: ఆకాశ్ పూరి
- నా చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారు తెలుసు
- తనే ఈ సినిమా ప్రమోట్ చేస్తానని అన్నారు
- ముంబై వెళ్లి అక్కడ ఆయనను కలిశాను
- ఒక రోజంతా మా కోసం కేటాయించారు
ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ . "నా చిన్నప్పటి నుంచి కూడా నాన్న - ప్రభాస్ చాలా క్లోజ్. అందువలన మేము అడగకుండానే ఆయన ఈ సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పారు. ముంబై షూటింగులో బిజీగా ఉన్న ఆయన, ఈ సినిమా కోసం ఒక రోజును కేటాయించారు.
ఆయనతో గడిపిన ఆ రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను. అలాగే రమ్యకృష్ణ గారితో కలిసి నటించడం కూడా మరిచిపోలేని జ్ఞాపకం. నా తదుపరి సినిమా 'చోర్ బజార్' షూటింగును పూర్తిచేసుకుంది. మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని చెప్పుకొచ్చాడు.