ఈ ఊరు కేసీఆర్ కు, నాకు అన్నం పెట్టింది: హరీశ్ రావు
- సింగాపురం గ్రామంలో హరీశ్ రావు ఎన్నికల ప్రచారం
- సింగాపురం కేసీఆర్ కు, తనకు ఆతిథ్యమిచ్చిందన్న హరీశ్
- హుజూరాబాద్ కు ఈటల చేసిందేమీ లేదని వ్యాఖ్య
ఈ ఊరు తమకు అన్నం పెట్టిందని ఆయన అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తనకు కూడా ఆతిథ్యమిచ్చి ఆదరించిందని చెప్పారు. ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ కు ఓటు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. సింగాపురం అంటే తనకు ఎంతో ఇష్టమని... ఈ ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే మరింత కష్టపడి పని చేస్తామని, మీ రుణం తీర్చుకుంటామని అన్నారు.
బీజేపీ నేతలు చెప్పే మాటలను నమ్మొద్దని గ్రామస్థులను హరీశ్ కోరారు. ధరలు పెంచిన బీజేపీ మనకెందుకని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల చేసిందేమీ లేదని అన్నారు. దళితబంధు పథకాన్ని అమలు చేయకపోతే తన పేరును మార్చుకుంటానని చెప్పారు.