హీరోయిన్ కంగన రనౌత్ కు కోర్టులో చుక్కెదురు
- కంగనపై జావెద్ అఖ్తర్ పరువునష్టం దావా
- కేసును మరో కోర్టుకు మార్చాలంటూ పైకోర్టులో కంగన పిటిషన్
- జడ్జి నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నారన్న కోర్టు
అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సదరు కోర్టు కంగన పిటిషన్ ను తోసిపుచ్చింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగానే విచారణ జరుపుతున్నారని కోర్టు తెలిపింది. కంగనకు వ్యతిరేకంగా పక్షపాతాన్ని ప్రదర్శించలేదని చెప్పింది. చట్టబద్ధంగా వెళ్లడం కంగనకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టు కాదని తెలిపింది. కేవలం అనుమానం కారణంగా కేసులో ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.