కేసీఆర్ తీరు చూస్తుంటే జాలేస్తోంది: డీకే అరుణ
- ఉపఎన్నికను కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలనుకుంటున్నారు
- అవినీతి సొమ్ముతో ఏమైనా చేస్తామని కేసీఆర్ అనుకుంటున్నారు
- దళితబంధును అమలు చేయలేక చతికిల పడ్డారు
రోజుకో అబద్ధం చెపుతూ కేసీఆర్ కాలం గడుపుతున్నారని అరుణ విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. చివరకు ఆ పథకాన్ని అమలు చేయలేక చతికిల పడ్డారని... పథకాన్ని ఆపేయించిందంటూ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పేద దళితులందరికీ దళితబంధును ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. చివరకు భూములను అమ్ముకుని ఆదాయాన్ని సమకూర్చుకునే దుస్థితికి కేసీఆర్ సర్కారు దిగజారిందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు.