తెలంగాణ వనరులను దోచుకునేందుకు ఈ ముగ్గురు ముందుకు వస్తున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
- రేవంత్, సంజయ్, షర్మిలలు రాష్ట్ర వనరులను దోచుకునేందుకు వస్తున్నారు
- రాష్ట్రాన్ని, కేసీఆర్ ను అపవిత్రం చేయాలని చూస్తున్నారు
- హుజూరాబాద్ లో విపక్షాలకు ఓటమి తప్పదు
హుజూరాబాద్ ఉపఎన్నికలో విపక్షాలకు పరాభవం తప్పదని, టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని... ఈ ధరలను తగ్గించాలనే ఆలోచన కేంద్రంలోని బీజేపీకి లేదని విమర్శించారు. హుజూరాబాద్ లో ఓటు అడిగే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని అన్నారు.