తెలంగాణలో మరో 193 కరోనా కేసుల వెల్లడి
- గత 24 గంటల్లో 42,367 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 64 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,963 మందికి చికిత్స
అదే సమయంలో 196 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,69,932 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,025 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,963 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,944కి పెరిగింది.
