'నాట్యం' చిత్రబృందానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు
- ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాట్యం'
- సంధ్యారాజు ప్రధాన పాత్రలో విలక్షణ చిత్రం
- నాట్యకళ గొప్పదనాన్ని ఆవిష్కరించారన్న వెంకయ్య
- కళల ప్రాధాన్యతను కళ్లకు కట్టారని ప్రశంసలు
ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'నాట్యం' బృందానికి అభినందనలు తెలిపారు. కూచిపూడి నృత్యకళాకారిణి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాట్యకళ గొప్పదనాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టారని ప్రశంసించారు. ఈ చిత్ర దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు అంటూ వెంకయ్య తన స్పందన తెలియజేశారు.