Nagachaitanya: వైజయంతీ మూవీస్ లో చైతూ!

Nagachaitanya in Nandini Reddy movie
షార్ట్స్‌లో చూడండి
నాగచైతన్య కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'లవ్ స్టోరీ' భారీ విజయాన్ని అందుకుంది. ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'థ్యాంక్యూ' చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో నందినీ రెడ్డి దర్శకత్వంలో చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం సంతోష్ శోభన్ దర్శకత్వంలో నందినీ రెడ్డి ఒక సినిమా చేస్తోంది.

 ఆ సినిమా పూర్తవ్వగానే నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టుపైకి వస్తుందని చెబుతున్నారు. ఈ లోగా చైతూ కూడా 'బంగార్రాజు'లో తన పోర్షన్ పూర్తి చేస్తాడట. చైతూతో నందినీ రెడ్డి చేయనున్న కథ, గతంలో విజయ్ దేవరకొండ కోసం అనుకున్నదేననే టాక్ వినిపిస్తోంది.
Go Back to Shorts
Nagachaitanya
Nandini Reddy
Vijay Devarakonda

More Telugu News