ఏపీ రాజకీయాలపై వర్మ ట్వీట్!.

Ram Gopal Varma tweet on AP politics
  • జగన్ ను తీవ్ర పదజాలంతో దూషించిన పట్టాభి
  • అట్టుడుకుతున్న ఏపీ రాజకీయం
  • నాయకులు త్వరలోనే బాక్సింగ్, కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న ఆర్జీవీ
ఒక్కసారిగా మారిన రాజకీయ పరిణామాలతో ఏపీలో హింసాత్మక వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి ఒక పదాన్ని ఉపయోగించడంతో వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. పట్టాభి ఇంటితో పాటు పలుచోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడి చేశారు. మరోవైపు వైసీపీపై టీడీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నాయి. తగ్గేదే లేదు... దేనీకైనా రెడీ అనే విధంగా తొడగొడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే... త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
Go Back to Shorts
Ram Gopal Varma
Tollywood
Andhra Pradesh
Politics

More Telugu News