ఏపీలో గత 24 గంటల్లో 483 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 40,191 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 5,654 మందికి చికిత్స
అదే సమయంలో 534 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,287 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,41,316 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,654 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,317కి పెరిగింది.