భయపెడుతున్న టమాటా ధర.. కోల్‌కతాలో కిలో రూ. 93

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన టమాటా ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. కూర ఏదైనా టమాటా తప్పనిసరి కావడంతో అది కొనకుండా, దానిని వాడకుండా వంట కార్యక్రమం పూర్తికావడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా పంట దారుణంగా దెబ్బతింది.

మరీ ముఖ్యంగా టమాటా ఎక్కువగా సరఫరా అయ్యే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు పంటను దారుణంగా దెబ్బతీశాయి. దీంతో ఒక్కసారిగా సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరిగిపోయింది. కోల్‌కతాలో కిలో టమాటా ధర రూ. 93కు చేరుకోగా, చెన్నైలో రూ. 60, ఢిల్లీలో రూ. 59, ముంబైలో రూ. 53గా ఉంది. మరో 50 నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దాదాపు ప్రతి చోట కిలో టమాటా ధర రూ. 50 దాటేసింది. హైదరాబాద్‌లో కిలో రూ. 70-80 మధ్య పలుకుతోంది.

Tomato
Kolkata
Rate
Madhya Pradesh
Maharashtra

More Telugu News