హుజూరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ: మాణికం ఠాగూర్
- హుజూరాబాద్ లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు
- ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోయింది
- హుజూరాబాద్ లో ఇంటికొక నిరుద్యోగి ఉన్నాడు
అధికారంలోకి వస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన టీఆర్ఎస్... ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటికొక నిరుద్యోగి ఉన్నాడని చెప్పారు. ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. ఈ నెల 30న హూజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.