'రొమాంటిక్' రిలీజ్ డేట్ ఖరారు!
- ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
- కథానాయికగా కేతిక శర్మ పరిచయం
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
- అక్టోబర్ 29వ తేదీన విడుదల
ఈ సినిమాను విడుదలకు ముస్తాబుచేసి చాలా రోజులే అయింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో, సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయింది. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు.
ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషించారు. మకరంద్ దేశ్ పాండే .. మందిరాబేడీ .. దివ్య దర్శిని .. ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
.